ETV Bharat / state

టీడీపీ జోన్‌-4 సమావేశానికి నెల్లూరు వేదిక.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం - cbn nellore tour

CBN NELLORE TOUR : తెలుగుదేశం జోన్‌-4 సమావేశానికి నెల్లూరు వేదికగా మారింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 5 పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో.. సమావేశం నిర్వహించనున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.

CBN NELLORE TOUR
CBN NELLORE TOUR
author img

By

Published : Apr 7, 2023, 8:57 AM IST

టీడీపీ జోన్‌-4 సమావేశానికి వేదికగా నెల్లూరు.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం

CBN NELLORE TOUR : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మరో సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న టీడీపీ జోన్ల వారీ ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధినేత తొలిసారి జిల్లాకు వస్తుండగా.. నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

నెల్లూరులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జోన్‌-4 పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు, యూనిట్‌ బాధ్యులు హాజరుకానున్నారు. వీరితో పాటు ఆరు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సుమారు 2వేల 500 మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సదస్సులో.. పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు.

జోన్‌-4 షెడ్యూల్‌..: ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జోనల్‌ అధ్యక్షుల ప్రసంగాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. టెలిగ్రామ్‌ బాట్‌ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇస్తారు. ఆర్టీఎస్‌, ఓటరు పరిశీలన, కుటుంబ సాధికార సారధి నియామక ప్రక్రియ పైన, వైసీపీ మోసకారి సంక్షేమంపై అవగాహన, కార్యకర్తల సంక్షేమం, న్యూట్రిఫుల్‌ యాప్‌, సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌ గ్రూపులు, అక్రమ అరెస్టులు, కేసులు ఎదుర్కోవడంపై న్యాయ విభాగం నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అధినేత చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటల నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంశంపై జోనల్‌, పార్లమెంట్‌ వారీ సమీక్షలు, చివరిలో చంద్రబాబు ముగింపు ఉపన్యాసం ఉంటుంది.

రోడ్డు మార్గంలో సభా వేదికకు: చంద్రబాబు శుక్రవారం ఉదయం ఆయన నివాసం ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు జరిగే ప్రాంతానికి చేరుకుంటారని సమాచారం. సభా వేదిక ప్రాంతంలో అసెంబ్లీలో నియోజకవర్గాల వారీగా కుర్చీలు ఏర్పాటు చేశారు. సమీక్షల అనంతరం.. సాయంత్రం 5 గంటల వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడనున్నారు. సదస్సుకు వచ్చే వారికి ఆహారం, వసతి కల్పించడానికి ఐదు కమిటీలను నియమించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.