ETV Bharat / state

వైసీపీలో అంతర్యుద్దం.. విధ్వంసాల సంవత్సరంగా 2022 : చంద్రబాబు - ఏపీ తాజా వార్తలు

CHANDRABABU FIRES ON CM JAGAN : రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదని.. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిందని ఆక్షేపించారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొన్నాయన్నారు. అధికార పార్టీలోనూ అంతర్యుద్దం మొదలైందని బాబు పేర్కొన్నారు.

CHANDRABABU FIRES ON CM JAGAN
CHANDRABABU FIRES ON CM JAGAN
author img

By

Published : Dec 31, 2022, 1:14 PM IST

Updated : Dec 31, 2022, 10:39 PM IST

CBN FIRES ON JAGAN :రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓవైపు ...జగన్ ఒక్కడే మరోవైపుగా జరిగే పోరాటం అన్ స్టాపబుల్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పోరులో తెలుగుదేశం విజయమూ అన్‌స్టాపబుల్ అని ధీమా వ్యక్తం చేశారు. 2022 జగన్ విధ్వంసాల సంవత్సరంగా మిలిగిపోయిందన్న చంద్రబాబు...తెలుగుదేశం ప్రభంజనం చూసి వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు.

జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది

ముఖ్యమంత్రి జగన్ చర్యలతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను కోల్పోయారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనపై నెల్లూరు జిల్లా రాజుపాలెంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన...ప్రజలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా క్షోభ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. కనీసం తప్పు ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసుకునే స్థితిలో జగన్‌ లేరన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తున్నందునే ... ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రం కార్యక్రమానికి వస్తున్న ప్రజా స్పందన చూసి ప్రభుత్వంలో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారడానికి జగన్‌ చర్యలే కారణమని ధ్వజమెత్తారు. జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.

వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏడాదీ విధ్వంసాలే: 2022కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని విమర్శించారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతీ ఏడాది విధ్వంసాలేనని మండిపడ్డారు. ప్రభుత్వ విధ్వంసాల పనితనం ప్రజలు అనుభవించారన్నారు. ప్రతిపక్షంలో పలుమార్లు టీడీపీ ఉన్నా ప్రజలు ఎప్పుడూ ఇంతగా ఇబ్బందిపడలేదన్నారు. అందుకే జగన్‌ రెడ్డిని సైకో అనేదని.. మీడియా సహా వివిధ వ్యవస్థలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందాడని ఆక్షేపించారు.

"రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గంజాయి, డ్రగ్స్ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదు. ఈ మూడున్నరేళ్లలో 53 వేలమందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొన్నాయి. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఎక్కడా లేని పన్నులు రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రజలపై 40 రకాల పన్నులు మోపారు. ఆఖరికి చెత్తపైనా పన్ను వేసి వసూలు చేస్తున్నారు"-చంద్రబాబు, టీడీపీ అధినేత

కావలి తెలుగుదేశం ఎస్సీ నేత హర్ష కుటుంబ సభ్యులు చంద్రబాబుని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఇటీవల ఎమ్మెల్యే ఇంటి ముందు తన బిడ్డ ఆత్మహత్యాయత్నం చేశారని ఆయన తల్లిదండ్రులు విలపించారు. వారిని ఓదార్చిన చంద్రబాబు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హర్ష ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. తెదేపా శ్రేణులను వేధించిన ఎమ్మెల్యేలు, పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

గంజాయి హబ్​గా రాష్ట్రం: దేశంలో ఎక్కడాలేని ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతీ రైతు మీద అప్పుందని.. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని తెలిపారు. కౌలురైతు వ్యవస్థలో అగ్రస్థానంలో ఏపీ ఉండేదని.. కానీ ఇప్పుడు కౌలు రైతులు కూడా పారిపోయారన్నారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. గంజాయి, డ్రగ్స్‌ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదని విమర్శించారు. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు : నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ముగిసింది. నెల్లూరు పర్యటన అనంతరం ప్రకాశం జిల్లా పర్యటనకు బయల్దేరారు. మార్గమధ్యంలో కందుకూరు ఘటన మృతురాలి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కొండపి మండలం పెట్లూరులో రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈదమూరి రాజేశ్వరి కుటుంబానికి ఆర్థికసాయం చెక్కు అందజేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 31, 2022, 10:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.