నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్తసత్రం సముద్ర తీర ప్రాంతంలో అలల ఎగిసిపడుతున్నాయి. నివర్ తుఫాన్ బలపడటంతో 20 మీటర్ల వరకు సముద్రపు అలల ముందుకు వస్తున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రపు ఒడ్డున ఉన్న బోట్లు వలల సురక్షిత ప్రదేశాలకు తరలించనున్నారు. నివర్ తుఫాన్ పై కావలి ఆర్డీఓ శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓ అన్నారు.
ఇదీ చదవండి