ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి శోభ - మకర సంక్రాంతి సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా.. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. అందమైన రంగవల్లులు వేసి మహిళలు సంక్రాంతిని నిర్వహించుకుంటున్నారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరిస్తున్నారు. వేకువఝాము నుంచే ముగ్గులు వేస్తూ సందడి చేశారు.

statewise sankranthi celebrations
రాష్ట్ర వ్యాప్తంగా..తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ
author img

By

Published : Jan 15, 2020, 6:37 PM IST

ఆమదాలవలసలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు

శ్రీకాకుళం జిల్లా జలుమూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో యువకులంతా కలిసి సందడి చేశారు. ఆముదాలవలస జూనియర్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

కడప జిల్లా..

కడప జిల్లాలో సంక్రాంతి వేడుకలు

జమ్మలమడుగులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పలు పోటీలు సరదాగా సాగాయి. నగరంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు రకరకాల ముగ్గులు వేశారు. వంటల పోటీల్లో 30 మంది మహిళలు పోటీపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా..

తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా క్రీడా పోటీలు

క్రీడలతోనే రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో సీఆర్​సీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి మహిళల, రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా..

పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా..క్రీడా పోటీలు

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని చాటే సత్తా క్రీడాకారులకు ఉందని సబ్ కలెక్టర్ కేఎస్.విశ్వనాథన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ పరిధి రుస్తుంబాద గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ క్రీడలతో పట్టుదల పెరుగుతుందన్నారు.

అనంతపురం జిల్లా..

అనంతపురం జిల్లాలో సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సందర్భంగా రొద్దం మండలం కేంద్రంలో హరిదాసుల కీర్తనలు అలరించాయి. మహిళలు, యువత ఉదయాన్నే లేచి రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. హరిదాసు బుటారి చంద్రశేఖర్ హరినామ కీర్తనలను ఆలపించారు.

ప్రకాశం జిల్లా..

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలోని సోపిరాలలో సంక్రాంతి సందర్భగా.. శీతారాముల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

విశాఖ జిల్లా..

విశాఖ జిల్లాలో సంక్రాంతి రంగవల్లుల పోటీలు

ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రవరంలో సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయి మహిళలు ముగ్గుల పోటీలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా..

చిత్తూరు జిల్లాలో భక్తిశ్రద్ధలతో సంక్రాంతి వేడుకలు

చిత్తూరు జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన తంబళ్లపల్లెలో సంక్రాంతి పండుగను గ్రామీణులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కరువు ప్రభావంతో కాడెద్దులు, స్వదేశీ పశు మందలు అంతరించిపోయాయని ఆవేదన చెందారు. అయినా.. గ్రామాల్లో మహిళలు చొరవ చూపి ఇళ్ల ముంగిట అందమైన ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేశారు.

ఇదీ చదవండి:

సంక్రాంతి వేళ.. గంగిరెద్దుల సందడే వేరు

Intro:శ్రీకాకుళం జిల్లా జలుమూరులో సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి ఆటపాటలతో సందడి పంచుకున్నారుBody:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.