ప్రభుత్వం సూచించిన వరి రకాలనే రైతులు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ సూచించారు. నేడు నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌తో కలిసి అరుణ్ కుమార్ పర్యటించారు. స్థానిక రైతులతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన వరి రకాలనే సాగు చేయాలని రైతులకు అరుణ్ కుమార్ సూచించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేస్తామన్నారు.
ఈ క్రాప్ విధానం గురించి రైతులకు వివరించారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్లాలను ఏర్పాటు చేస్తామన్నారు. మద్దతు ధర లభించేలా చేస్తామని హామీ ఇచ్చారు. పలు మండలాల్లో ఎంటీయూ-1010ను సాగు చేసి ధాన్యం అమ్ముకోలేక రైతులు తిప్పలు పడుతున్నారని ఆవేదన చెందారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదని కొందరు రైతులు అరుణ్ కుమార్ వద్ద మోర పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: