నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు వేయించి వీధుల్లో ప్రదర్శన చేశారు. క్రీసెంట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో చిన్నారులకు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో వేయించి పాటలు పాడించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆకర్షణగానిలిచారు.
ఇదీచూడండి.గోపీ లోలా... చిన్నకృష్ణుల సందడి...