నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో పెన్నా డెల్టాకు ఆదివారం నాడు 11 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదు. జలాశయ సందర్శనానికి వచ్చిన ప్రజలను గాలికొదిలేశారు. దీంతో జలాశయం ఆపరాన్ ప్రాంతం వద్ద ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. అయితే ఆ ముగ్గురు యువకులు మద్యం సేవించినట్లుగా తెలుస్తుంది. పోలీసుల ఎదుట ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. పెను ప్రమాదం నుంచి యువకులు బయటపడడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యవైఖరిపై సందర్శకులు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: విపక్షాల గందరగోళంతో రాజ్యసభలో వాయిదాల పర్వం