నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వలసలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తీవ్ర దుర్భిక్షం నెలకొన్న ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే ప్రణాళికలను సిద్ధం చేశారు. 70 కిలోమీటర్లు దూరంలో సోమశిల రిజర్వాయరు ఉన్నా... కాలువలు లేక సాగుకు, తాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా సోమశిల హైలెవల్ కెనాల్‌కు ముఖ్యమంత్రి జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. కాలువలను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. దీనికి మెుత్తం వ్యయం రూ.1,497 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
హై లెవల్ కాలువలు పూర్తిచేస్తే 2లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 2.35లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గుండెమడకల, కంపసముద్రం, చాబోలు వద్ద రిజర్వాయర్లు నిర్మించనున్నారు. రిజర్వాయర్లకు ప్రత్యేకంగా రూ.88కోట్లు కేటాయించారు. దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు మండలాల భూములకు రెండో దశ కాలువల వల్ల సాగునీరు అందుతుందని అధికారులు వెల్లడించారు. ఈ కాలువ పనులు డిసెంబరులో మెుదలుకానున్నాయి.
ఇదీచదవండి