నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే డా.వరప్రసాద్‌రావు ఇంటిని గూడూరు రూరల్ చవటపాలెం గ్రామస్థులు ముట్టడించారు. చవటపాలెంలో మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన కామాంధులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులపై దిశ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నిరసనతో దిగివచ్చిన ఎమ్మెల్యే ఆయన ఇంటి నుంచి ప్రజలతో కలిసి కాలినడకన 3 కిలోమీటర్ల దూరంలోని చవటపాలేనికి చేరుకున్నారు. యువతి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: