నెల్లూరు జిల్లా గంపర్లపాడులో ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఎస్‌ఈబీ(SEB) అధికారులు అడ్డుకున్నారు. అయితే అధికారులను చూసి..ఆపకుండా నాలుగు ఇసుక ట్రాక్టర్లు పరారయ్యాయి. ఒక ట్రాక్టర్‌ను పట్టుకుని అధికారులు సీజ్ చేశారు. మరో 3 ట్రాక్టర్ల కోసం గాలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలువురిపై ఎ.ఎస్.పేట పీఎస్‌లో ఎస్‌ఈబీ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఈ యాప్స్ వాడుతున్నారా.. అయితే మోసపోయినట్టే!