శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి కాసేపట్లో.. పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌకను ప్రయోగించనున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రీకౌంట్ డౌన్ మెుదలైంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం నిన్న ఉదయం 8.24 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. 26 గంటల పాటు నిరంతరాయంగా కౌన్ డౌన్ కొనసాగి.. ఈ ఉదయం 10.24గంటలకు అంతరిక్షంలోకి పీఎస్ఎల్వీ దూసుకుపోనుంది.
ఈ రాకెట్ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమోజోనియా-1, మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే షార్కు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు చేరుకున్నారు. ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ కైలాస వాడివో శివన్ పర్యవేక్షించనున్నారు.
చెంగాళమ్మకు పూజలు
శ్రీహరికోటకు ఆనుకుని ఉండే.. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి అధికారులు శివన్ దంపతులకు స్వాగతం పలికారు. నేడు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక విజయవంతం కావాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి:
విశాఖ రైల్వే జోన్ ప్రకటనకు రెండేళ్లు.. నేటికీ కానరాని పురోగతి!