A school bus stuck in the mud : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండలం గుడిపాడు వద్ద నుండి కలిగిరికి వెళ్లే రోడ్డు వర్షాలకు బురదమయంగా తయారయ్యింది. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు బురదలో ఇరుక్కుపోయింది. దీంతో విద్యార్థులంతా బస్సులో నుండి దిగగా స్థానికుల సహాయంతో బురదలో ఇరుక్కుపోయిన బస్సును వెనక నుండి నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్లు ఎంత దారుణంగా ఉంటే తమ పిల్లలను స్కూలుకు ఎలా పంపించాలంటూ తల్లిదండ్రులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: