Protest: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెదేపా, దళిత సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాకినాడలో దళిత యువకుడి మృతి విషయంలో.. వైకాపా ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పరిపాలనలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులను వైకాపా ప్రభుత్వం అరికట్టకపోతే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: