ETV Bharat / state

'తెదేపాకు గెలిచే అవకాశం లేక.. మెజార్టీ తగ్గించే పనిలో ఉంది' - ఈరోజు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు

తిరుపతి ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈనెల 29న కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని నామినేషన్ పత్రాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Sarvepalli MLA Kakani Govardhan Reddy
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
author img

By

Published : Mar 28, 2021, 11:43 AM IST

తిరుపతి ఎంపీ స్థానానికి ఈనెల 29న వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు.. వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం.. కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని నామినేషన్ పత్రాలు అందించనున్నట్లు నెల్లూరులో ఆయన పేర్కొన్నారు.

కరోనా నిబంధనలను అనుసరిస్తూ కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని.. గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు. గెలుపుపై ఆశ లేని తెలుగుదేశం పార్టీ, తమ మెజార్టీ తగ్గించే ప్రయత్నాల్లో ఉందని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి ఘన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

మేయర్ పక్కన వైకాపా నేత... కార్పొరేటర్ల అభ్యంతరం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.