సర్పంచ్ పదివిని వేలం నిర్వహించి ఎకగ్రీవం చేసుకోగా.. వచ్చిన నగదును గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాలని కంకణం కట్టుకున్నారు అక్కడి యువకులు. నెల్లూరు జిల్లా రామనాయుడు పల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి గ్రామస్థులు వేలం నిర్వహించారు. వచ్చిన నగదును గ్రామ అభివృద్ధి కొరకు ఉపయోగించాలని వారు నిర్ణయం తీసుకున్నారు.
హోరాహోరీగా జరిగిన వేలం పాటలో చాలామంది పాల్గొనగా.. చివరకు పోంగులూరి వెంకటేశ్వర్లు 21లక్షల 20వేల రూపాయలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడు. అందరూ కలిసి అతనిని ఎకగ్రీవంగా ఎన్నికున్నారు. ఎవరు పోటీ చేయకుండా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కాస్త హడావుడి చేయగా.. గ్రామస్థులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. విషయాన్ని మీడియాకు చెప్పడాని కూడా ముందుకు రాలేదు.
ఇదీ చదవండి: