నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ అమ్ములూరులో తెలుగుదేశం మద్దతుదారు.. సర్పంచ్‌గా పోటీలో ఉన్న గుంజి రుద్రయ్య.. పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. గ్రామంలోని ఓ కాలనీ వద్ద ఉండగా అక్కడకు వచ్చిన పోలీసులు.. అకారణంగా తనపై దాడికి దిగారన్నారు.
మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వైకాపా నాయకులను మాత్రం ఏమీ అనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కానీ.. పోలీసులు మాత్రం ఇలా వ్యవహరించడం మంచిధతి కాదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతల అరాచకానికి అడ్డూ లేకుండా పోతోందని విమర్శించారు.
ఇదీ చదవండి: