నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి రెండో శ్రామిక రైలు ఆదివారం బిహార్‌కు బయలుదేరింది. 1152 మంది వలస కార్మికులతో ఈ రైలు మోతిహర్కు బయలుదేరింది. నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ జండా ఊపి వలస కార్మికులకు వీడ్కోలు పలికారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ నిబంధనల ప్రకారం భోగీకి 54 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులకు మంచి నీరు, ఆహారం అందించారు.
ఇదీ చదవండి : కరోనాపై పోరు: టీకా రాకుంటే.. ప్లాన్- బీ తప్పదు