నెల్లూరు జిల్లాలో ఇసుక సమస్యగా మారింది. సామాన్యులకు ఇళ్లు నిర్మించుకుందామంటే దొరకడం లేదు. సామాన్యులకు ఉచితంగా ఇస్తామని చెబుతున్న మాటలు ఆచరణలో సాధ్యం కావడంలేదు. ఇసుక దొరక్క జిల్లాలో అనేక ప్రాంతాల్లో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి.
జిల్లాలో పెన్నా పరివాహక ప్రాంతం, స్వర్ణముఖీ నదీ తీరప్రాంతాల్లో ఇసుకరీచ్లు ఉన్నాయి. జిల్లాలో అధికారికంగా మొత్తం 15ఇసుక రీచ్లు ఉన్నాయి. గత జనవరి నుంచి ఇసుక సమస్య వల్ల ఇళ్ల నిర్మాణాలు జరగడంలేదు. ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడంలేదు. సచివాలయం కేంద్రంగా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా సాధ్యం కావడంలేదు. జిల్లాలో ప్రస్తుతం ఐదువేలకుపైగా ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య కారణంగా నిలిచిపోయాయి.
టైరు బండి ఇసుక రూ.500, ట్రాక్టర్ ఇసుక రూ.4వేలకు పైగా బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఇంత ధర పెట్టి కొనలేక అనేక మంది మధ్యతరగతి వర్గాల వారు నిర్మాణాలను మధ్యలో నిలిపివేశారు. చెన్నై, బెంగుళూరు రాష్ట్రాలకు మాత్రం టిప్పర్లు తరలిపోతున్నాయి. సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు....
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఇదే విధంగా ఉంటే మరో రెండుమూడు నెలలు ఇసుక దొరకడం కష్టం అవుతుంది. అధికారులు ముందస్తు ప్రణాళికతో ఇసుకను డంప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా సచివాలయాల ద్వారా... ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేప్పట్టాలి. రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఇసుక నిల్వలను పెంచి... అక్రమంగా తరలిపోతున్న ఇసుక రవాణాను అడ్డుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: