'మౌనాన్ని వీడి కేంద్రాన్ని ప్రశ్నించండి' భారత రాజ్యాంగాన్ని కేంద్రంలో భాజపా ప్రభుత్వం ధిక్కరిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శైలజానాథ్ ఆరోపించారు. నెల్లూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సంఖ్యా బలం ఉందన్న ధీమాతోనే భాజపా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్ తీరు తేనెపూసిన కత్తిలా ఉందంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు, మేధావులు మౌనాన్ని వీడి కేంద్రాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో 45 నిమిషాలు సమావేశమై రాష్ట్రానికి ఏం సాధించారంటూ జగన్మోహన్రెడ్డిని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :నాసిరకానికి నిదర్శనమా? అధికారుల అలసత్వమా?