ఈ నెల 13 నుంచి జరిగే సమ్మెకు యాజమాన్యమే బాధ్యత వహించాలని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ దామోదరరావు అన్నారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక బహిరంగ సభ జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బంది కుదించే చర్యలను వెనక్కి తీసుకోవాలని, అద్దె బస్సులు పెంచే ఆలోచన విరమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. యాజమాన్యం ముందుంచిన 27 డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మె తప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్ అయినా గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇది కూడా చదవండి.