కరోనా విధులకు వెళ్తున్న తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరులో ఆర్టీసీ కార్మికులు నిరసన చేశారు. వలస కార్మికులను తరలించేందుకు వెళ్తున్న తమకు శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు అందజేయాలని కోరారు. అధికారులు మాత్రం మాస్కులు తప్ప ఏమి ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మద్యం దుకాణాల వద్ద విధులకు నియమించడం దారుణమన్నారు. జిల్లాలో మద్యం దుకాణాల వద్ద నియమించిన 142 మంది కార్మికులను వెనక్కి పిలిపించాలని కోరారు.
ఇదీ చూడండి విశాఖ 'గ్యాస్ లీకేజీ' ఘటనపై ఐరాస విచారం