Roads damaged in Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి నందవరం వైపు సుమారు 55 కిలోమీటర్లు రోడ్డు అడుగడుగునా దెబ్బతిని గోతులమయమైంది. చుట్టుపక్కల 200 గ్రామాలను కలిపే ప్రధానమైన రోడ్డు.. నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. నందవరం, ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు, చినమాచనూరు, పోలిరెడ్డిపల్లి, నందిపాడు గ్రామాల మధ్య పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఉన్న ఒక్క సింగిల్ రోడ్డు మార్జిన్‌లు దెబ్బతినడంతో.. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నామంటున్నారు ప్రయాణికులు. 20 కిలోమీటర్లు ప్రయాణించడానికి.. సుమారు 2గంటల సమయం పడుతుందని.. గోతులతో వాహనాలు పాడైపోతున్నాయంటున్నారు వాహన చోదకులు. ఇటీవల కురిసిన వర్షాలకు రాత్రి వేళలో...అత్యవసర ప్రయాణాలు చేయాడానికి ఆలోచించాల్సి వస్తోందంటున్నారు ప్రయాణికులు. నిత్యం ఈ రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయని.. డబుల్ రోడ్డు కోసం అధికారులకు విన్నవించుకున్నా... పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ప్రధాన పట్టణాలకు వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుందంటున్నారు. ఆరు నెలల నుంచి వెంకటాపురం రిజర్వాయర్ కోసం గ్రావెల్ మట్టి తీసుకెళ్లడానికి టిప్పర్ల వల్ల రోడ్డు అధ్వాన్నంగా మారిందంటున్నారు. అక్కడక్కడ గోతుల్లో కొందరు నల్లరేగడి మట్టి పోశారు. వర్షాలకు బురదగా మారి వాహనాలు జారిపడిపోతున్నాయి. గుంతల రోడ్డు పూడ్చడానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి.. గుంతలు పూడ్చి డబుల్ రోడ్డు మంజూరు చేయాలని ప్రయాణికలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: