నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కాలేజ్ సమీపంలో లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆత్మకూరు మండలం బోయల చిరివెళ్ల గ్రామానికి చెందిన రాము (24) అనే యువకుడు మృతి చెందాడు. కృష్ణమూర్తి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.
ఇదీ చదవండి:
సెల్ఫీ సూసైడ్: భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి బలవన్మరణం