నెల్లూరు జిల్లా(NELLORE DISTRICT) కావలి బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(ROAD ACCIDENT) జరిగింది. కంటైనర్‌ను.. ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తిరుపతి పద్మావతి నగర్‌కు చెెందిన ఓ కుటుంబం ప్రకాశం జిల్లా ఉలవపాడులోని బంధువుల ఇంటికి వెళ్లారు. వారు తిరిగి వస్తున్న క్రమంలో ముసునూరు బ్రిడ్జిపైన ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో.. ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కావలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతి చెందినవారు.. ఇరుగు వెంకట రమణయ్య, పాలమల రాజేశ్వరమ్మ, కైలసాని భార్గవిలుగా గుర్తించారు.
ఇదీ చదవండి: