నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరకు తీవ్ర గాయాలయ్యా. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నెల్లూరు నుంచి కావలి వైపుగా వస్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో రాజుపాళెంకు చెందిన సందీప్ అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన కోవూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..