ఈనాడు ఈ టీవీ వారు ప్రచురించిని ఓ చిన్నారి దీనస్థితికి చలించిన పలువురు దాతలు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. తండ్రి ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్న భార్య నలుగురు పిల్లలతో అతి దీనస్థితిలో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతూ ఉండగా దాతలు చలించి ముందుకు వచ్చారు. ఈరోజు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. రాబోయే రోజుల్లో ఇంకా పేద కుటుంబానికి మా పౌండేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఐక్య పౌండేషన్ నిర్వాహకుడు రామకృష్ణ తెలిపారు.
ఇది చదవండి విద్యుత్ బిల్లులకు నిరసనగా తాళ్లపాక అనురాధ నిరాహార దీక్ష