తల్లీబిడ్డల మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్షమే కారణమని ఆరోపిస్తూ వారి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బుచ్చిరెడ్డిపాలెంలోని గుడిపల్లి కాలువ సమీపంలో నివాసముంటున్న భవాని.. గర్భవతి. ఆమెకు ఆదివారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావడం వల్ల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా ఆమె పండింటి బిడ్డకు జన్మనించింది. సోమవారం మధ్యాహ్నం బిడ్డ, తల్లి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరూ మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబసభ్యులు ఆ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డ మృతిచెందారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఆందోళనకారులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించారు.
ఇవీ చదవండి: వాహనాలు వచ్చే.. ప్యాకింగ్ కేంద్రాలు పోయే!