ETV Bharat / state

'వ్యవసాయ విద్యుత్ సర్వీసుల కోరకు మీ సేవలో నమోదు చేసుకోండి' - నెల్లూరు జిల్లా ముఖ్యంశాలు

వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సర్వీస్ కావాల్సిన రైతులు... సచివాలయం, మీ సేవలో నమోదు చేసుకోవాలని నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్​ఈ ఆదిశేషయ్య తెలిపారు. ఈ సేవ కోసం 50 రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

వివరాలను వెల్లడిస్తున్న ఎస్​ఈ ఆదిశేషయ్య
వివరాలను వెల్లడిస్తున్న ఎస్​ఈ ఆదిశేషయ్య
author img

By

Published : Mar 25, 2021, 5:35 PM IST

రైతులకు సంబంధించిన వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సర్వీస్ కావాల్సిన రైతులు సచివాలయం, మీ సేవలో నమోదు చేసుకోవాలని నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఆదిశేషయ్య తెలిపారు. సర్వీస్ కావాల్సిన రైతు 50 రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఫొటో, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు తప్పనిసరిగా సచివాలయంలో ఇవ్వాలన్నారు. సచివాలయం, మీసేవ సెంటర్ నుంచి సంబంధిత విద్యుత్ శాఖ కార్యాలయానికి రైతు నమోదు చేసుకున్న అప్లికేషన్ వెళ్లిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి రైతులకు సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

కరెంటు స్తంభం దగ్గరే సర్వీస్ ఇవ్వాలంటే ఐదు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కొంచెం దూరం ఉంటే 45 రోజులు సమయం పడుతుందని చెప్పారు. 5 హెచ్​పీ మోటార్​కు విద్యుత్ సర్వీస్ కావాలంటే 5,200 రూపాయలు ... 7హెచ్​పీ మోటార్ సర్వీస్ కావాలంటే 7,350 రూపాయలు చెల్లించాలన్నారు. ముందుగా 50 రూపాయలు చెల్లించి రిజిస్టర్ చేసుకున్న రైతులకు సర్వీసులు ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ఒకరు మృతి, నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.