నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో ఉమాదేవి నీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు... రోజుకు ఎన్ని ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారన్న అంశంపై వివరాలు తెలుసుకున్నారు. సమస్య లేకుండా... నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రజలకు నీటి సరఫరా చేయాలన్నారు. తహసీల్దార్ పూర్ణచందర్రావు, ఎంపీడీవో హనుమంతరావు, పంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో హాజరయ్యారు.
ఇదీ చదవండీ...