ETV Bharat / state

'వాలంటీర్ల ద్వారా రేషన్​ పంపిణీ చేస్తే.. ఆందోళన చేస్తాం'

author img

By

Published : Jan 10, 2021, 10:30 AM IST

రేషన్ డీలర్లకు వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించినప్పుడే వాలంటీర్ల ద్వారా సరకులు పంపిణీ చేయాలని.. రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు డిమాండ్ చేశారు. అలా కాకుండా.. వాలంటీర్లతో రేషన్ సరకులు పంపిణీ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ration dealers association president
రేషన్ డీలర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు

రాష్ట్రంలో రేషన్​ డీలర్లకు రావాల్సిన రూపాయలు 170 కోట్ల కమీషన్​ను వెంటనే ఇవ్వాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీలర్లకు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని శాసనసభలో చెప్పిన ముఖ్యమంత్రి.. సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు.

ప్రభుత్వం సరకులను వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్పడం బాగానే ఉందని... అయితే డీలర్లకు వృత్తి భద్రత, ఆర్థిక భరోసా కల్పించినప్పుడే ఆ పని చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు. అలా కాకుండా వాలంటీర్లతోనే పంపిణీ చేస్తే భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కరోనాతో చనిపోయిన రేషన్ డీలర్లకు 25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి:

అమ్మ కట్టుకున్న చీరే ఊయల రూపంలో ఊపిరి తీసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.