Rare Heart Surgery: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే డెక్ట్సో కార్డియా సైటస్ ఇన్ వర్సెస్ అనే అరుదైన గుండె వ్యాధి బాధితుడికి నెల్లూరులోనిమెడికవర్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 47ఏళ్ల వయసున్న తిరుపతిరెడ్డి ఛాతి నొప్పితో తమను సంప్రదించారని.. కార్డియోథొరాసికి సర్జన్ డాక్టర్ త్రిలోక్ తెలిపారు. అవసరమైన పరీక్షలు నిర్వహించగా.. కుడి వైపున ఉండాల్సిన అవయవాలు ఎడమ వైపు, ఎడమ వైపు ఉండాల్సినవి కుడివైపు ఉండటాన్ని గమనించామన్నారు. అతి తక్కువ మందిలో అరుదుగా ఈ సమస్య వస్తుందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఇలాంటి శస్త్ర చికిత్సల్లో ఇది 38వదని, దేశంలో ఐదోదని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆఫ్ పంప్ బీటింగ్ హార్ట్ సర్జరీల్లో ఇది 14వదిగా నిలిచిందన్నారు. అరుదైన ఈ శస్త్ర చికిత్సను.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన వైద్యుల బృందం సహకారంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని ఆసుపత్రి ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, సెంటర్ హెడ్ గణేష్ చెప్పారు.
ఇవీ చూడండి: