ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవ చేసే గొప్ప దానం రక్తదానం అని ఉదయగిరి ఆరోగ్య కేంద్రం వైద్యులు సందడి బాష, రక్తనిధి కేంద్రం ఛైర్మన్ షారుక్ అలీ తెలిపారు. రక్తదానం ప్రాణంతో సమానం అని వైద్యులు అన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండే వారిని తెలియకుండానే కాపాడినవాళ్లం అవుతామన్నారు. సృష్టిలో రక్తదానం చేసే గొప్ప అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉందన్నారు. రక్తదానం చేయడం వల్ల గుండెజబ్బుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. రక్త దానం పట్ల ప్రజలు అపోహలను వీడి రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.
ఇది కూడా చదవండి.