నెల్లూరులోని పురమందిరం కరోనా కారణంగా దాదాపు 11 నెలల పాటు మూతపడింది. తిరిగి ఈ కేంద్రాన్ని పునఃప్రారంభించారు. కళాప్రియులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పురమందిరం.. ఇన్ని రోజుల పాటు గతంలో ఎప్పుడూ మూతపడలేదు. కానీ గతేడాది మార్చి 15న విధించిన లాక్డౌన్తో అప్పటి నుంచి ఇక్కడ కళాప్రదర్శనలు నిలిపివేశారు.
దాదాపు 11 నెలల తర్వాత పారంభమైన ఈ కేంద్రంలో... మొదటగా బాలార్క శిష్య బృందం శాస్త్రీయ కచేరి నిర్వహించింది. అలాగే నాటక ప్రదర్శనలు జరిగాయి. భక్త చింతామణి నాటికలో భవాని పాత్రను జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు గంగాధర్ రెడ్డి పోషించగా, చింతామణిగా రత్నశ్రీ నటించారు. నాటక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించిన కళాభిమానులు చప్పట్లతో పురమందిరాన్ని హోరెత్తించారు. కళాభిమానాన్ని చాటుకున్నారు.
ఇదీ చదవండి: