ETV Bharat / state

పీఎస్‌ఎల్‌వీ-సి50 ప్రయోగం విజయవంతం - సీఎంఎస్ శాటిలైట్ తాజా వార్తలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహకనౌక, విజయాలకు మారుపేరుగా కీర్తి గడించిన పీఎస్​ఎల్వీ 52వ ప్రయోగం విజయవంతమైంది. 27ఏళ్ల ప్రస్థానంలో తిరుగులేని విజయాలను అందుకోవడం సహా, 374 ఉపగ్రహాలను విజయవంతంగా ఆయా కక్ష్యల్లోకి చేర్చిన పీఎస్​ఎల్వీ తాజాగా కమ్యూనికేషన్‌ శాటిలైట్ సీఎంఎస్​-01ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. సీఎంఎస్​-01..సీ-బ్యాండ్ సేవల విస్తరణకు దోహదపడనుంది.

PSLV-C50 experiment successful
PSLV-C50 experiment successful
author img

By

Published : Dec 17, 2020, 4:18 PM IST

Updated : Dec 17, 2020, 5:08 PM IST

భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రోకు.. జవసత్వాలు చేకూర్చిన పోలార్‌ శాటిలైట్‌ లాంఛ్‌ వెహికిల్‌-పీఎస్​ఎల్వీ.. మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తూ.. 52వ ప్రయోగాన్ని సఫలీకృతం చేసింది. ఈ మేరకు పీఎస్​ఎల్వీ-సీ50 వాహననౌక నిప్పులు కక్కుకుంటూ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకొని వెళ్లింది. 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం గురువారం మధ్యాహ్నం 3గంటల 41 నిమిషాలకు.. ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

సీఎంఎస్-01 ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. భారత ప్రధాన భూ భాగంతోపాటు అండమాన్‌ నికోబార్‌, లక్ష్యద్వీప్‌లో సీ-బ్యాండ్ సేవల విస్తరణకు ఇది దోహదపడనుంది.

పీఎస్​ఎల్వీ-సీ50 శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జరిగిన 77వ ప్రయోగం కాగా.. ఎక్స్​ఎల్ కాన్ఫిగరేషన్‌లో 22వ ప్రయోగం. ఈ ఏడాది తొలిసారి నవంబర్‌ 7న భూపరిశీలన ఉపగ్రహం- ఈఓఎస్-01ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. తాజాగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

పీఎస్‌ఎల్‌వీ-సి50 ప్రయోగం విజయవంతం

ఇదీ చదవండి: అమరావతిపై రెఫరెండానికి రెడీ..ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

Last Updated : Dec 17, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.