స్మశానానికి వెళ్లేందుకు దారి చూపాలని మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. గోగినేనిపురం కామాక్షినగర్ కు చెందిన వృద్ధురాలు రమణమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఎవరు చనిపోయినా మూడేళ్లుగా ఓ ప్రైవేట్ స్థలం నుంచి మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లేవారు. ఈ సారి ఆ స్థల యజమాని మృతదేహాన్ని తన స్థలం గుండా వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో రమణమ్మ మృతదేహంతో ధర్నాకు దిగగా... రావూరు-గూడూరు మధ్య వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ వ్యవహారంలో గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరక సమస్యను పరిష్కరించలేదని కామాక్షినగర్ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... స్మశానానికి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి-ఉద్యోగాల పేరుతో యువతుల నగ్న చిత్రాల సేకరణ