నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆటోలతో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి వైఎస్ విగ్రహం వరకు సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసేలా వైఎస్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు.
సీఏఏకు వ్యతిరేకంగా వైఎస్ విగ్రహానికి వినతిపత్రం - rajyanga parirakshana vedhika rally news in udhayagiri
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసేలా వైఎస్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన చేపట్టారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆటోలతో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి వైఎస్ విగ్రహం వరకు సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసేలా వైఎస్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:
సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన