వాటర్ ప్లాంట్ బాగు చేసి ప్రజలకు మంచి నీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లా కృష్ణారెడ్డిపల్లిలో మహిళలు ఆందోళన చేశారు. బిజ్జంపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురై 3 రోజులు కావస్తున్నా అధికారులు ఎవరూ స్పందించలేదని వాపోయారు. కుళాయి నుంచి వచ్చే కలుషిత నీరు తాగి రోగాల బారిన పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాగేందుకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేక తామంతా అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఐదు గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చే వాటర్ ప్లాంట్ను తక్షణమే బాగు చేయించాలని మహిళలు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే మండల కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
అది అగ్ని ప్రమాదం కాదు.. ఆత్మహత్యే.. తిరుమల అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్..