శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు పోస్టాఫీసును.. పోస్టు మాస్టర్ జనరల్ శ్రీలత పరిశీలించారు. స్థానికులకు పోస్టాఫీసుల ద్వారా అందుతున్న కొత్త పథకాల గురించి వివరించారు. ఈనెల నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన విశ్రాంత ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్లను ఇంటి దగ్గరకే అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి, సురక్ష ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ గురించి వివరించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారని పెళ్లకూరు పోస్టుమాస్టర్ మధుసూధన్, సిబ్బందిని ఆమె సన్మానించారు.
ఇవీ చూడండి...