ETV Bharat / state

ఉదయగిరిలో టెన్షన్​​.. ఎమ్మెల్యే మేకపాటి Vs వైసీపీ నాయకుల సవాళ్లు - nellore political news

WAR BETWEEN MLA MEKAPATI AND YCP LEADERS : నెల్లూరు జిల్లాలో రాజకీయం కాక రేపుతోంది. నిన్నటివరకు ఒకే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్​ చేయడం.. ఆపై ఆరోపణలు చకచకా జరిగిపోతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే సైతం రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపైనే కుర్చీలో కూర్చొని మరీ ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్​ కొనసాగుతోంది.

WAR BETWEEN MLA MEKAPATI AND YCP LEADERS

author img

By

Published : Mar 31, 2023, 11:25 AM IST

Updated : Mar 31, 2023, 12:09 PM IST

ఎమ్మెల్యే మేకపాటి Vs వైసీపీ నాయకుల సవాళ్లు

WAR BETWEEN MLA MEKAPATI AND YCP LEADERS : రాష్ట్రంలో రాజకీయం రణరంగంగా మారుతోంది. అధికార పార్టీ ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలు, వైసీపీ నుంచి సస్పెండ్​ అయిన నలుగురు ఎమ్మెల్యేల పరస్పర దూషణలతో రాజకీయం వాడివేడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లాలో పరిస్థితి వేరే విధంగా ఉంది. ఎమ్మెల్యే మేకపాటి సవాళ్లు.. వైసీపీ నేతల ప్రతిసవాళ్లతో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది.

నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యేX వైసీపీ నేతలు అన్నట్లు పరిస్థితి మారింది. పార్టీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​ రెడ్డి.. అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై సవాళ్లు చేస్తున్న నాయకులకు ప్రతి సవాళ్లు విసురుతున్నారు. నిన్న ఉదయగిరిలోని బస్టాండ్​ సమీపంలో నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ తనపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారికి సవాల్​ విసిరారు.

అయితే మేకపాటికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఉదయగిరిలో రోడ్డుపై బైఠాయించి మేకపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నాయకుడు వినయ్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి రావాలంటూ వైసీపీ కార్యకర్తలు ప్రతి సవాల్ విసిరారు. తాము లేనప్పుడు వచ్చి మాటలు చెప్పడం కాదని.. దమ్ముంటే ఇప్పుడు బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎమ్మెల్యే సవాల్‌కు ప్రతి సవాల్‌ విసురుతూ వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. అయితే ఇప్పుడు ఉదయగిరిలో ఏం జరుగుతుందోనని ప్రతి ఒక్కరూ టెన్షన్​ పడుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​ రెడ్డి వస్తే.. ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న అనుమానాలు అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది.

వైసీపీకి తలపోటుగా మారిన సస్పెండ్​ అయిన ఎమ్మెల్యేల తీరు: అయితే మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్​ అయిన ఎమ్మెల్యేల నుంచి అధికార పార్టీకి భంగపాటు తప్పడం లేదు. పార్టీలో ఉన్నంతకాలం మాట్లాడటానికి ఆచితూచి వ్యవహరించిన వాళ్లు.. ఇప్పుడు తమ మాటలకు పదును పెట్టారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తూ.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వరుస మీడియా సమావేశాలు పెట్టి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా వైసీపీ చేసే దందాలకు తాను అడ్డుగా ఉన్నాననే భావించి పార్టీ నుంచి సస్పెండ్​ చేశారని.. తనకి ప్రాణహాని ఉందని ఉండవల్లి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు నెల్లూరు రూరల్​ ఎమ్మెల్యే కోటంరెడ్డి అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని రాష్ట్ర ప్రజలు బహిష్కరిస్తారని వ్యాఖ్యలు చేయగా.. మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సైతం భవిష్యత్తులో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకం అని కామెంట్​ చేశారు. వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి సైతం తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్​ అయినాక వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ పెద్దల తలలు పట్టుకుంటున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుందని.. ఇప్పుడు ఏం చేయాలి అనే దానిపై పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.