ETV Bharat / state

వరదలను లెక్కచేయకుండా.. విధి నిర్వహణ - జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న పెన్నా నది వార్తలు

వరదల్లోనూ వెనుకడుగు వేయక విధి నిర్వహణలో రాత్రంతా జాతీయ రహదారిపై నిరీక్షించారు బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సురేష్ బాబు సంగం ఎస్సై శ్రీకాంత్​లు. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం.. ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన వారు, వాహనాలను నిలిపేందుకు అక్కడకు చేరుకున్నారు. ఇంతలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కూడా వరదల్లో చిక్కుకోవటంతో రాత్రంతా అక్కడే వేచి ఉన్నారు. చుట్టుపక్కల గ్రామస్థులను అప్రమత్తం చేస్తూనే.. నీటి ప్రవాహం తగ్గిన అనంతరం వాహనాలను వదిలారు.

police in penna river floods
వరదల్లో చిక్కుకున్న ఎస్​ఐ, సీఐ విధి నిర్వహణ
author img

By

Published : Nov 28, 2020, 1:28 PM IST

విధి నిర్వహణలో వాహనాలు మళ్లించేందుకు వెళ్లి.. నీటి ప్రవాహం ఉద్రిక్తంగా మారడంతో సీఐ, ఎస్ఐలు రాత్రంతా జాతీయ రహదారిపై నిరీక్షించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సమాచారం తెలుసుకొని బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సురేష్ బాబు, సంగం మండలం ఎస్సై శ్రీకాంత్​లు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బీరాపేరు, బొగ్గేరు వాగుల నీటిప్రవాహం జత కలిసి పెన్నానదికి భారీగా వరద నీరు చేరుకుంది. సంగం మండల కేంద్రం నుంచి ఆత్మకూరు మండలం వాసిలి వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. రహదారి, పొలాలను ఏకం చేస్తూ నీరు ప్రవహించటం ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది.

ఈ ప్రవాహంలో రహదారిపై వాహనాలు రాకపోకలు జరిపితే ప్రమాదం తప్పదని ఊహించిన ఎస్ఐ, సీఐలు చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేశారు. జాతీయ రహదారిపై వాహనాలను నిలుపుదల చేసి.. సమీపంలోని కోలగట్ల, వీర్ల గుడిపాడు గ్రామస్థులను కూడా అప్రమత్తం చేశారు. అనంతరం వీరు తిరిగి మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రయాణమైన క్రమంలో పెరమన సమీపంలోకి రాగానే ఒక్కసారిగా వరద ఉద్ధృతి ఎక్కువైంది. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లేందుకు వీలులేకుండా ప్రవాహంలో చిక్కుకున్నారు. దీంతో రాత్రంతా అక్కడే జాతీయ రహదారిపై నిరీక్షించారు.

తెల్లవారేసరికి కొద్దిగా నీటి ప్రవాహం తగ్గిన అనంతరం వాహనాలను విడిచిపెట్టారు. ఇండియా ఆఫ్ బలగాలను నీటి ప్రవాహం వద్ద ఉంచి సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్రీకాంత్​లు బయలుదేరి వెళ్లారు. సీఐ సురేష్ బాబు విధి నిర్వహణలో భాగంగా వరద ప్రాంతానికి వచ్చి.. ప్రజలను అప్రమత్తం చేసేందుకు రాత్రంతా రహదారిపై ఆగి ఉండటం పలువురు అభినందిస్తున్నారు.

ఇవీ చూడండి...

పెన్నాకు వరదపోటు...జలదిగ్బంధంలో నెల్లూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.