ETV Bharat / state

పుత్తూరులో కిడ్నాప్.. వెంకటగిరిలో ప్రత్యక్షం - నెల్లూరు జిల్లా ముఖ్య వార్తలు

చిత్తూరు జిల్లాలో కిడ్నాప్​కు గురైన ఓ వ్యక్తిని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన వ్యక్తి గతంలో నెల్లూరు జిల్లా పరిషత్ పనిచేసేవారు. బాధితుడిని.. పోలీసులు తిరిగి పుత్తూరు పంపించారు.

పోలీస్​స్టేషన్
పోలీస్​స్టేషన్
author img

By

Published : Aug 28, 2021, 3:58 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరులో కిడ్నాప్ కు గురైన ఓ వ్యక్తిని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన వ్యక్తి గతంలో నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేసే వారు. ఉద్యోగం చేస్తూ వెంకటగిరిలో ఈఓఆర్డీ వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నగదు సేకరించినట్లు సమాచారం.

ఉద్యోగం ఇప్పించక పోగా ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదని సమాచారం. ఈ కారణంగా నగదును రాబట్టేందుకు అతనిని కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకు వచ్చారు. బాధిత వ్యక్తి బంధువులు పోలీసులను ఆశ్రయించిన కారణంగా వెంకటగిరి లో ఉన్న వ్యక్తిని ఆయన స్వగ్రామమైన పుత్తూరుకు తీసుకెళ్లినట్లు ఇక్కడి పోలీసులు తెలిపారు. పుత్తూరు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ బీచ్ కారిడార్​లో పర్యాటకం పరుగులు.. అభివృద్ధికి సర్కారు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.