నెల్లూరు జిల్లా సంగంలో నకిలీ బంగారాన్ని అంటగట్టి మోసం చేస్తున్న ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 లక్షల 10 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన రానా తిరుమల నాయక్, గోవింద శ్రీనివాసులు అనే వ్యక్తులు.. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరు గ్రామానికి చెందిన మహబూబ్ బాషాకు మాయ మాటలు చెప్పి ముందుగా కొద్దిగా మంచి బంగారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అలాంటి బంగారమే వారి ఇంటి పనులు చేస్తుండగా దొరికిందని చెప్పి తక్కువ ధరకు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పారు. రూ.4,50,000 తీసుకుని నకిలీ బంగారాన్ని అంటగట్టి ఉడాయించారు. బాధితుడు సంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మోసపూరిత వృత్తిని ఎంచుకున్న ఈ ఇద్దరు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారని... ప్రజలు అత్యాశకు పోయి ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని డీఎస్పీ రాఘవ రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి