Kakani Govardhan Reddy Nellore Court Case : నెల్లూరులోని నాలుగో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో.. గతంలో జరిగిన చోరీ ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసు ఆధారాలు, పత్రాలు చోరీకి గురైందని కోర్టు క్లర్కు నాగేశ్వరరావు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఏప్రిల్ 14న చిన్నబజార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా హైకోర్టు ఆదేశాల మేరకు.. సీబీఐ చెన్నై విభాగం మంగళవారం కేసు నమోదు చేసింది.
నెల్లూరు ఖుద్దూస్ నగర్‌కు చెందిన సయ్యద్ హయత్, ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన షేక్ ఖాజా రసూల్‌లను నిందితులుగా పేర్కొంది. నిందితులను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారని వారి నుంచి శ్యామ్‌సంగ్ ట్యాబ్, లెనోవా ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. నిందితుల రిమాండు రిపోర్టు, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ.. హైకోర్టు జారీ చేసిన తీర్పు పత్రాలను ఎఫ్ఐఆర్కు జత చేసింది.
ఇవీ చదవండి: