ETV Bharat / state

"మొక్కుబడిగా కాకుండా... బాధ్యతగా మొక్కలు నాటాలి"

మొక్కను నాటామా... ఫోటోకు ఫోజులిచ్చామా... వెళ్లిపోయామా అని కాకుండా అవి పెరిగేలా చూడాలని మంత్రి అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

అనిల్ కుమార్
author img

By

Published : Aug 31, 2019, 5:02 PM IST

మంత్రి అనిల్​కుమార్ ప్రసంగం

మొక్కలు నాటినప్పుడు ఫోటోలకు ఫోజులిచ్చిన అధికారులు.. ఆ తరువాత వాటి పెంపకంపై అశ్రద్ధ వహిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అలాకాకుండా ప్రతి ఒక్కరూ.. మొక్కలు నాటి.. దానిని బ్రతికించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నెల్లూరులోని కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. ప్రజలు లక్షల మొక్కలు నాటామని చెబుతున్నారే తప్ప.. మరలా వాటి గురించి పట్టించుకోవటం లేదని అన్నారు. విద్యార్థులు వారి ఇంట్లో ఒక మొక్క నాటి దానిని బతికించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. దేశం, రాష్ట్రంలో ఉండవలసిన దానికన్నా చెట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. చెట్లు లేకపోతే వాతావరణ పరిస్థితి దెబ్బతింటుందని... ఆ పరిస్థితులు రానివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.

Intro:వన మహోత్సవం లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

Body:70వ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం పట్ల శ్రద్ధ చూపి పర్యావరణ పరిరక్షణకు చేయూత అందించాలన్నారు. మొక్కల పెంపకం వలన మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క అయినా పెంచి పోషించాలని సూచించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం వల్ల ఈరోజు మంచి పని చేశానని ఆనందంగా ఉందన్నారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకవైపున వసతిగృహం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడారు.

Conclusion:వన మహోత్సవం లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573944

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.