ETV Bharat / state

ముళ్లపొదల్లో యువకుడి మృతదేహం.. - వింజమూరులో అనుమానాస్పద మృత దేహం

నెల్లూరు జిల్లా వింజమూరులో హరి ప్రసాద్ అనే యువకుడి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. ముళ్లపొదల్లో అతడి దేహం పడి ఉండటాన్ని స్థానిక పశువుల కాపరులు గుర్తించారు.

suspicious murder
అనుమానాస్పదంగా మృతి చెందిన హరి ప్రసాద్
author img

By

Published : Oct 21, 2020, 9:27 AM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడిని కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా హరి ప్రసాద్​గా గుర్తించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని ముళ్లపొదల్లో అతడు పడి ఉండగా పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

చేనేత కార్మికుడిగా పనిచేసిన హరి ప్రసాద్.. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు చేస్తున్నాడని ఎస్సై బాజిరెడ్డి తెలిపారు. ఇటీవలే ఉపాధి కోసం తెలంగాణ వెళ్లి తిరిగి వచ్చాడని వివరించారు. గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు గుర్తించామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అతడికి నాలుగేళ్లలోపు ఇద్దరు కుమార్తెలుండగా.. భార్య గర్భవతిగా ఉంది.

ఇదీ చదవండి:

అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు.. భార్యాభర్తలు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.