కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో పలువురు మృతి చెందుతున్నారు. అటు మృతదేహాలను తరలించేందుకు ఇటు రోగులను ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సదుపాయం ఉండడం లేదు. బాధితుల కుటుంబ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్‌లను సంప్రదిస్తుండడంతో వారు వేలల్లో నగదు వసూలు చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన అంబులెన్స్‌లు నిరుపయోగంగా ఉంటున్నాయి. వాటికి వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ' పాజిటీవ్ రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నాం'