ETV Bharat / state

చీకటి బేరం! శ్రుతిమించిన ఇసుకాసురులు - Penna is theplace for sand mining in nellore

అధికారులందరూ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నారు. ఇది ఇసుకాసురులకు బాగా కలిసొచ్చింది. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు.. ఇసుక రీచ్‌లతో పొక్లెయిన్లతో ఇసుకను తోడేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లలో నింపి కాసులు పోగేసుకుంటున్నారు. వందల సంఖ్యలో ఇసుక వాహనాలు తరలిపోతుండగా.. పోలీసులు, తదితర అధికారులకు పట్టుబడుతున్నది మాత్రం ఒకటీ, రెండు వాహనాలు కావడం గమనార్హం. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపులపై కథనం.

nellore  district
అనంతసాగరం : మినగల్లు వద్ద అక్రమంగా ఇసుక తవ్వకం
author img

By

Published : Apr 28, 2020, 11:05 AM IST

నెల్లూరు జిల్లాలో ప్రధాన నీటి వనరైన పెన్నానది ఇసుక అక్రమ తవ్వకాలకు నెలవుగా మారింది. కలువాయి మండలంలో అనధికారికంగా రీచులు మలచుకొని అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు వాటిని తొలగించినా.. అక్రమార్కులు మాత్రం దర్జాగా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. తోలేది వందల వాహనాలు.. పట్టుబడేది మాత్రం ఒకటీ, రెండే.

* ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో ఇసుక అక్రమ తవ్వకాలు హోరెత్తాయి. 15 ట్రాక్టర్లు ఇటీవల బారులు తీరడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. అధికారులు రావడంతో వాహనాలన్నీ వెళ్లిపోగా.. అక్కడున్న మూడు వాహనాలను సీజ్‌ చేశారు.

* కోడూరుపాడు వద్ద అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

* అనంతసాగరం మండలం మినగల్లు వద్ద ఇటీవల స్థానిక నాయకులే పొక్లెయిన్లతో ఇసుక తోడేస్తున్నారు. పీకేపాడు, శంకరనగరం ప్రాంతాల నుంచీ యథేచ్ఛగా సాగుతోంది.

* ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నాతో పాటు బొగ్గేరు నుంచి కూడా తోడేస్తున్నారు. అప్పారావుపాళెం, వాశిలి, నాగులపాడు, బోయల చిరువెళ్ల గ్రామాల వద్ద నుంచి ఇసుక తరలించుకుపోతున్నారు.

* గూడూరు మండలంలోని నెర్నూరు, గొల్లపల్లి ప్రాంతాల్లోని కైవల్యానది ఇసుకను అక్రమార్కులు తరలిస్తున్నారు. ఒక్కో ట్రక్కు ఇసుకను రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పట్టణాలకు తరలించి విక్రయిస్తున్నారు. రోజుకు అక్రమంగా 10 నుంచి 20 ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

* సైదాపురం మండలంలోని వేములచేడు నుంచి రామసాగరం మీదుగా దాదాపు 15 కిలోమీటర్ల దూరం కైవల్యానది ప్రవహిస్తోంది. రామసాగరం వద్ద ఇసుకరీచ్‌కు అనుమతి ఉంది. కానీ అక్రమార్కులు నది పొడవునా తవ్వేస్తున్నారు. కలిచేడు సమీపంలోని కండలేరు వాగు, పిన్నేరువాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు.

* సీతారామపురం మండలం నుంచి ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల వరకు ఉండే పిల్లా పేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నాయకులతో అధికారులు చేతులు కలిపి ఈ తంతు జరిపిస్తున్నారనే విమర్శలున్నాయి.

రెండు రీచ్‌లకే అనుమతులు
పెన్నా పరివాహక ప్రాంతాల్లో పల్లిపాడు, ముదివర్తిపాళెం 1, 2, పొట్టేపాళెం, జొన్నవాడ, సజ్జనాపురం, నాగరాజుతోపు, ముదివర్తిపాళెం, మినగళ్లు, గొళ్లకందుకూరు, మినగళ్లు, దామరమడుగు, అప్పరావుపాళెం 1, 2, స్వర్ణముఖినదిలో వాకాడు, పెళ్లకూరు మండలంలో పుల్లూరులో రీచ్‌లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. అయితే వీటిలో గ్రీన్‌జోన్‌లోని అప్పారావుపాళెం 1, 2 రీచ్‌లు, పుల్లూరు రీచ్‌లోనే అధికారిక తవ్వకాలు చేయాలి.

అక్రమంగా తరలిస్తే కేసులు
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రెడ్‌జోన్‌ అమల్లో ఉన్న మండలాల్లో ఇసుక తరలింపులు చేయకూడదని ఏపీఎండీసీ మేనేజర్‌ స్పష్టం చేశారు. కేవలం గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లోని వాటికే అనుమతులు ఉన్నాయని అన్నారు. అక్రమంగా ఎక్కడ ఇసుక తరలింపులు చేసినా కేసులు నమోదు చేస్తామని గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ దిశగా తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు.

పర్యవేక్షణ మార్పుతో గందరగోళం
ఇసుక అక్రమ రవాణా అడ్డుకునే పర్యవేక్షణ ఎక్సైజ్, ప్రొహిబిషన్‌ శాఖకు అప్పగించారు. ఈ శాఖ తరఫున పరిశీలన ఉండటం లేదు. నియంత్రణ అంత కన్నా లేదనేలా పరిస్థితులు నెలకొన్నాయి. మైనింగ్‌ శాఖ తీరు నామమాత్రంగా మారింది. పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉండటంతో వారు పట్టించుకోవటం లేదు.

ముమ్మారెడ్డిగుంట వాసుల నిరసన

పెళ్లకూరు మండలం పుల్లూరు రీచ్‌ వద్ద ఇసుక తవ్వకాలపై ముమ్మారెడ్డిగుంట వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రీచ్‌ తవ్వకాల కారణంగా తాగునీటి సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో పెద్ద ఆర్డర్లనే ఆమోదిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాల నిఘా లేదు.
నెల్లూరు గ్రామీణ మండలంలోని పొట్టెపాళెం, సజ్జనాపురం ఇసుక రేవుల నుంచి ఇసుకాసురులు అక్రమంగా తరలిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రతిరోజు వీరి అక్రమ రవాణా సాగుతోంది. ఇప్పటివరకు ఇసుక తరలిస్తున్న 28 మందిపై గ్రామీణ పోలీసులు కేసులు నమోదు చేసి 28 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. నగరంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.3,100 నుంచి రూ.3,300 వరకు విక్రయిస్తున్నారు. కొందరు ఎడ్లబండ్ల ద్వారా ఇసుకను ఓ చోటకు తరలించి అక్కడ నుంచి వాహనాల్లో నింపి తరలిస్తున్నారు.

ఇది చదవండి కరోనా కేసులు పైపైకి.. 72 నుంచి 79కి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.