ETV Bharat / state

అందని 'పెళ్లి కానుక'.. ఏడాదిగా నవ దంపతుల ఎదురుచూపులు - ఏపీలో పెళ్లి కానుక పథకం వార్తలు

నిరుపేద నవ దంపతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పెళ్లి కానుక ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి దరఖాస్తు చేసుకున్న దంపతులకు సాయం మంజూరు కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పథకానికి నిధులు పెంచారు. అదే నెల నుంచి కానుకల పోర్టల్‌ పని చేయక వివాహాల నమోదు నిలిచిపోయింది. ఈ పథకాన్ని ఏప్రిల్‌ 20, 2018న ప్రవేశ పెట్టారు.

pelli kaanuka scheme in nellore district
అందని 'పెళ్లి కానుక'
author img

By

Published : Jul 2, 2020, 11:57 AM IST

పెళ్లైన నవ దంపతులకు గతంలో వివాహ కానుకల పేరుతో గిరిజనులకు గిరిపుత్రిక, మైనార్టీలకు దుల్హాన్‌ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కులాంతర వివాహాలు, విభిన్న ప్రతిభావంతులకు వివాహాలు, కార్మికులకు పెళ్లి కానుక కింద ఆయా శాఖల్లో ప్రోత్సాహకాలు అందేవి. కొన్ని వర్గాల నిరుపేదలకు ఈ ప్రోత్సాహకాలు దరిచేరకపోవటంతో అన్నింటినీ కలిపి ఒకే వేదిక కింద గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ పరిధిలో, పట్టణ ప్రాంతాల్లో మెప్మా శాఖలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద ఈ పథకం అమలవుతోంది.

సాయం కోసం 6,944 మంది నిరీక్షణ

పెళ్లికానుక నిధులు గతేడాది ఏప్రిల్‌ నుంచి మంజూరు చేయలేదు. రిజిస్ట్రేషన్లు మాత్రం ఆయా మండల సమాఖ్య, పట్టణ సమాఖ్య కార్యాలయాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు చేపట్టారు. ఆ తర్వాత నెల నుంచి పోర్టల్‌ పనిచేయక ఈ పథకానికి దరఖాస్తు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు జిల్లాలో 10,221 మంది పెళ్లికానుక కోసం దరఖాస్తు చేయగా.. 3,277 మందికి వంద శాతం రూ.14.02 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 6,944 మంది ఎదురుచూస్తున్నారు.

దంపతులకు భరోసా

పెళ్లికానుక పథకం కింద వధువు 18, వరుడు 21 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. మొదటిసారి వివాహం చేసుకున్న వారే అర్హులు. మహిళా వితంతవులకైతే రెండో వివాహానికి లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రజా సాధికారత సర్వేలో నమోదై ఉండాలి. మీసేవ ద్వారా పొందిన కుల ధ్రువీకరణ పత్రాన్ని, ఆధార్‌, వయస్సు ధ్రువీకరణ పత్రాలను పదో తరగతి మార్కుల లిస్టు, చదువు లేని వారైతే మీసేవ ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్‌తో, పెళ్లి కార్డులతో.. వివాహం జరిగే 5 రోజుల ముందు మెప్మా కార్యాలయాలు, మండలాల సమాఖ్య కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

వధువు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలి. వరుడు ఆంధప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వాసులైనా అర్హులు. అయితే వివాహం మాత్రం మన రాష్ట్రంలోనే జరగాలి. పెళ్లి కానుక నమోదైన తర్వాత కల్యాణ మిత్రల ద్వారా వివాహం వేదిక పరిశీలన జరుగుతుంది. ఆ సమయంలో వధువు, వరుడు చేతి గుర్తులు వారు సేకరిస్తారు. వారి పెళ్లి ఫొటోలు కల్యాణ మిత్రలు తీసి, వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం ప్రభుత్వం కానుక నిధులు మంజూరు చేస్తుంది.

వధువు ఖాతాలోనే నగదు

పెళ్లికానుకను వధువు ఖాతాలోనే జమ చేస్తారు. ఇందుకు బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసి ఉండాలి. పెళ్లి కానుకను ఎస్సీలు, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతరానికి రూ.1.20 లక్షలు చొప్పున మంజూరు చేస్తారు. బీసీలకు రూ.50 వేలు, బీసీ కులాంతరానికి రూ.75 వేలు, దుల్హాన్‌ పథకానికి రూ.లక్ష, భవన నిర్మాణ కార్మికులకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు అందజేస్తారు. గతేడాది నుంచి పెళ్లి కానుకలు అందక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

వివాహ పరిశీలనలకు అంతరాయం

కొవిడ్‌-19తో వివాహాల పరిశీలనకు కల్యాణ మిత్రలు హాజరు కాకుండా నిలుపుదల చేశారు. దాంతో వివాహాల వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ జరగలేదు. లాక్‌డౌన్‌ కారణంగా వివాహాలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో ఆ సమయంలో జరిగిన వివాహాలకు కల్యాణమిత్రలు హాజరుకాలేదు. వారి పరిశీలన లేక దంపతులకు నిధులు అందలేదు.

ప్రభుత్వ అనుమతితో

'ప్రస్తుతం పెళ్లికానుక నమోదు ప్రక్రియ నిలిచింది. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే నమోదు చేస్తాం. ఇప్పటికే నమోదైన దంపతులకు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వమే నిధులు జమ చేస్తుంది. గత సంవత్సరం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది.' -- శీనానాయక్‌, పీడీ, డీఆర్‌డీఏ

ఇవీ చదవండి...

పీఎం స్వనిధి.. చిరువ్యాపారుల పెన్నిధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.