ETV Bharat / state

అకాల వర్షాలు, అనుకూలించని వాతావరణంతో వరిపంటకు దెబ్బ - నెల్లూరులో వరి రైతుల కష్టాలు వార్తలు

నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది వరిసాగు రైతులకు కష్టాలు, కన్నీళ్లు తప్పడంలేదు. వాతావరణం అనుకూలించిందని ఆనందంతో ఇబ్బడిముబ్బడిగా సాగు చేశారు. దిగుబడులు అనూహ్యంగా తగ్గిపోవడంతో దిగాలు పడ్డారు. ఏకరాకి 45బస్తాలు ధాన్యం వస్తాయని సంబరపడ్డారు. తీరా చూస్తే 20నుంచి 30బస్తాలు మాత్రమే దిగుబడులు వచ్చాయి. ఉత్పత్తి సగానికి తగ్గడం. ఒకే సారి పంటరావడంతో ధరలు పడిపోయాయి. దళారులు, మిల్లర్లు రైతును దగా చేస్తున్నారు. తరగుపేరుతో బస్తాకు 4కేజిలు కోత వేస్తూ రైతును అన్ని విధాలుగా దెబ్బతీస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది.

paddy farmers troubles at nellore district
నెల్లూరులో రైతన్నల కష్టాలు
author img

By

Published : Feb 19, 2020, 7:00 AM IST

నెల్లూరు జిల్లాలో 182లక్షల హెక్టార్లు సాధారణ వరిసాగు చేయాల్సి ఉంది. వర్షాలు కురవడంతో ఈ ఏడాది 2లక్షల హెక్టార్లలో అధికారికంగా సాగు చేశారు. 16లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అధికారులు ముందస్తు అంచనాతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 191కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పటికి 100కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు నిర్వహణ సరిగా లేక.. రైతులు రోడ్లమీదనే ధాన్యం పోసుకుంటున్నారు.

జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ మాత్రమే పనిచేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది సరిగా పనిచేయకపోవడంతో కేంద్రాలు మొక్కుబడిగా మారాయి. రైతుల్లో కేంద్రాలపై నమ్మకం లేక దళారులకు అమ్మివేసేందుకు సిద్దమయ్యారు. కేంద్రాల్లో ఇప్పటి వరకు 1100మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దిగుబడులు లేక.. ధరలు లేక ఈ ఏడాది పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వహణ సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తూకం యంత్రాలు, తేమశాతం పరికరాలు పనిచేయడంలేదు. సిబ్బందికి ఆయా యంత్రాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సరైన దిగుబడి రాక రైతులు.... దళారులు చింతిస్తున్నారు. మిల్లర్ల స్వార్థపూరిత చర్యలతో మరింత నష్టపోతున్నారు. నిర్వహణ కేంద్రాల పనితీరు మెరుగుపరచి... ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం ముక్కవస్తుందనే సాకుతో మిల్లర్లు కొనుగోలు చేయడంలేదు. ఇళ్లలో దాచుకునే అవకాశాలు లేక బస్తా ధాన్యం వారు అడిగిన ధరలకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

నెల్లూరులో రైతన్నల కష్టాలు

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో పది టన్నుల ఉల్లి చెడిపోయే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.