ETV Bharat / state

అన్నదాతల ఆదాయంపై లాక్​డౌన్​ పిడుగు..!

author img

By

Published : Mar 27, 2020, 5:20 PM IST

లాక్​డౌన్​తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోయాయి. మరోవైపు వరికోతలకు, ఉద్యాన తోటల కాపలాకు వెళ్తోన్న తమను పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు చెబుతున్నారు.

nellore district farmers
nellore district farmers
అన్నదాతల ఆదాయంపై లాక్​డౌన్​ పిడుగు..!

లాక్​డౌన్ పరిస్థితులతో నెల్లూరు జిల్లాలోని అన్నదాతలకు గడ్డుకాలం ఏర్పడిందని రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కోటిరెడ్డి తెలిపారు. జిల్లాలో వరికోతలు ఇప్పటికి 50 శాతం మాత్రమే పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. మిగతా పనులకు లాక్​డౌన్​ అడ్డంకిగా మారిందన్నారు. మరో వైపు జిల్లాలో 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని... అక్కడ సిబ్బంది మాత్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. లాక్​డౌన్ విధించాక రైతుల్ని పోలీసులు కొనుగోలు కేంద్రాల వద్దకు పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన రైతులు తోటల దగ్గరకి వెళ్లాలంటే పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని కోటిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.